Published : 14 Feb 2021 14:08 IST

ఫ్లిప్‌ ఆర్ట్‌తో ‘కె.జి.యఫ్‌2’టీజర్‌!

 ఆకట్టుకుంటున్న చిన్నారి అభిమాని ప్రతిభ

చెన్నై: సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ‘కె.జి.యఫ్‌’ ఛాప్టర్‌-2 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌ వీక్షణల్లో సునామీనే సృష్టించింది. తాజాగా ఒక చిన్నారి అభిమాని ఈ టీజర్‌ను ఫ్లిప్‌ఆర్ట్‌ రూపంలో 100 భాగాలుగా చేసి ప్రదర్శించాడు. అవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వీటిని సూర్య ఫ్యాన్స్‌ తరఫున హీరో యష్‌ను ట్యాగ్‌ చేస్తూ కొందరు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. యశ్‌కు నచ్చుతుందని ఆశిస్తున్నట్టు రాసుకొచ్చారు. ఇది చూసిన ‘కె.జి.యఫ్‌’ చిత్ర నిర్మాత కార్తీక్‌గౌడ అద్భతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. 

జులై 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో యశ్‌ ‘కె.జి.యఫ్‌’ మొదటి చాప్టర్‌తోనే దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అభిమానులు సంపాదించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిత్ర నిర్మాణ సంస్థ  ఛాప్టర్‌-2 ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ అగ్రనటుడు సంజయ్‌దత్ ప్రతినాయక పాత్ర పోషిస్తుండటం విశేషం. మరోవైపు ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆకట్టుకుంటున్న బుడతడి ఫ్లిప్‌ ఆర్ట్‌ను మీరూ చూసేయండి!

ఇవీ చదవండి..

ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి!

ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని