ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి ఆటంకం.. థియేటర్‌ అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్‌

నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షోకు అంతరాయం కలిగింది. షో ప్రారంభమైన గంటలో స్క్రీన్‌ నిలిచిపోవడంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 25 Mar 2022 15:46 IST

విజయవాడ: నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షోకు అంతరాయం కలిగింది. షో ప్రారంభమైన గంటలో స్క్రీన్‌ నిలిచిపోవడంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో థియేటర్‌లోని ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. థియేటర్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేసే సమయంలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని