పుష్ప షూట్‌.. భారీగా అభిమానుల సందడి

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ లొకేషన్‌ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు సందడి చేశారు. దీంతో బన్నీ క్యారీవాన్‌ నుంచి దిగి వచ్చి వారందరికీ అభివాదం చేశారు. సుకుమార్‌-బన్నీ కాంబోలో తెరకెక్కుతోన్న...

Published : 02 Feb 2021 01:28 IST

కారావాన్‌ నుంచి దిగి పలకరించిన బన్నీ

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ లొకేషన్‌ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు సందడి చేశారు. దీంతో బన్నీ కారావాన్‌ నుంచి దిగి వచ్చి వారందరికీ అభివాదం చేశారు. సుకుమార్‌-బన్నీ కాంబోలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రీకరణ‌ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఖమ్మం జిల్లాలోని మోతుగూడెం వెళ్లింది.

సమాచారం తెలుసుకున్న అభిమానులు బన్నీని చూసేందుకు లొకేషన్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బన్నీ కారావాన్‌ నుంచి బయటకు వచ్చి అభిమానులందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి

నవ్వుల నవాబుకు శుభాకాంక్షల వెల్లువ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు