Shah Rukh Khan: నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ ఎంట్రీ.. ఎస్‌ఆర్‌కే ఫ్యాన్స్‌ సందడి..

షారుఖ్‌ ఖాన్‌ (Shah rukh khan) , దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.

Updated : 25 Jan 2023 12:29 IST

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah rukh khan) అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘పఠాన్‌’ (Pathaan) మూవీ బుధవారం విడుదలైంది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ నటించిన సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ముంబయితోపాటు వివిధ ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు థియేటర్లలోనూ ఇదే సందడి కనబడుతోంది. షారుఖ్‌ ఎంట్రీ సీన్స్ సమయంలో అభిమానులు.. ‘ఎస్‌ఆర్‌కే’ అంటూ కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో షారుఖ్‌ నటన, దీపికా పదుకొణె - షారుఖ్‌ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ అదరిపోయిందని, ముఖ్యంగా సల్మాన్‌ - షారుఖ్‌ సీన్స్‌ బాగున్నాయని, సినిమా తమకు నచ్చిందంటూ పలువురు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. అంతేకాకుండా తమ నాలుగేళ్ల ఆకలిని ఈ సినిమా తీర్చిందని అంటున్నారు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని