NTR: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అభిమానుల సందడి.. వీడియోలు వైరల్‌

నటుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాలు విదేశాల్లోనూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పుట్టినరోజు నాడు తమ హీరో....

Updated : 20 May 2022 15:24 IST

హైదరాబాద్‌: నటుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాలు విదేశాల్లోనూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పుట్టినరోజు నాడు తమ హీరోని ఒక్కసారి చూసి.. శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్‌..  జై జై ఎన్టీఆర్‌’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై టపాసులు కాల్చి, కేకులు కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక, కెనడాలోనూ ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్‌ పాటలకు అభిమానులు ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని