amala: అమలా మేడం! మీరు నటన కొనసాగించండి...ప్లీజ్‌: అభిమానుల రిక్వెస్ట్‌

నటిగా, సమాజ సేవకురాలిగా, అగ్రనటుడి భార్యగా, యువనటుడి తల్లిగా ఇలా నిజజీవితంలో ఎన్నో పాత్రలను విజయవంతంగా పోషిస్తూ, వెండితెరపై అప్పుడప్పుడూ సందడి చేస్తున్నారు అక్కినేని అమల...

Published : 13 Sep 2022 13:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నటిగా, సమాజ సేవకురాలిగా, అగ్రనటుడి భార్యగా, యువనటుడి తల్లిగా ఇలా నిజజీవితంలో ఎన్నో పాత్రలను విజయవంతంగా పోషిస్తూ, వెండితెరపై అప్పుడప్పుడూ సందడి చేస్తున్నారు అక్కినేని అమల(Amala Akkineni). దాదాపు 35 సంవత్సరాల క్రితం ‘మైథిలి ఎనై కథలి’ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అమల పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. వివాహానంతరం సిల్వర్‌స్క్రీన్‌ కి దూరమైన అమల 2012లో ‘లైఫ్‌ఈజ్‌బ్యూటిఫుల్‌’ ద్వారా మంచి పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు. ‘మనం’లో అతిథి పాత్ర పోషించిన ఆమె, మళ్లీ ‘ఒకే ఒక జీవితం’(Oke Oka Jeevitham) ద్వారా పూర్తిస్థాయి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి అభిమానులను అలరించారు.

ముఖ్యంగా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన అమల, దాదాపు 30 సంవత్సరాల తర్వాత కణం(Kanam) (తెలుగులో ఒకే ఒక జీవితం) చిత్రంతో మళ్లీ కోలీవుడ్‌ తెరపై కనిపించారు. ఇటీవల కణం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడిన ఆమె తమిళ అభిమానులను తనకు ప్రత్యేకమని తెలిపారు. ప్రతిచోటా నాగార్జున భార్యగా, అఖిల్‌ తల్లిగా గుర్తించే ఆమెను తమిళంలో మాత్రం నటిగా గుర్తిస్తారని వెల్లడించారు.

అయితే సెప్టెంబరు12న అమల పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తమిళ అభిమానుల నుంచి ‘అమలా మేడం! ప్లీజ్‌ మీరు నటనను కొనసాగించండి, మీరు తమిళ సినిమాల్లో తిరిగి నటించాల్సిందే, మీరేంతా బిజీగా ఉన్నా సినిమాల్లో కనిపించండి ప్లీజ్‌’ అంటూ వినతులు వచ్చాయి. అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున (Nagarjuna), అఖిల్(Akhil Akkineni)‌, శర్వానంద్‌(Sharwanand) తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నటన స్కూలు నిర్వహణతో పాటు, బ్లూ క్రాస్‌ కన్వీనర్‌గానూ పనిచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని