Faria Abdullah: ‘25 ఏళ్లు ఇండస్ట్రీలో పక్కాగా ఉంటావ్..’ అన్నారు!
నటి ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ. తన కొత్త చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమా గురించి ఆమె పంచుకున్న విశేషాలివీ..
హైదరాబాద్: ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన అందం ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అని యువకులు పాడుకునేలా చేసింది. ఇప్పుడు ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్’ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘‘హాయ్.. ఎలా ఉన్నారు? నేనండీ మీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఇప్పుడెందుకు వచ్చాననే కదా మీ అనుమానం. నేను తొలిసారి కథానాయికగా నటించిన ‘చిట్టి’ (జాతిరత్నాలు) పాత్రపై మీరెంతో అభిమానం చూపించారు. నా కొత్త చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’కూ (Like Share and Subscribe) మీ ఆశీస్సులు కావాలనే ఇలా వచ్చా. ఈ సినిమా నవంబరు 4న విడుదలవుతుంది. మీరంతా తప్పకుండా థియేటర్ వెళ్లి మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ‘ఏక్ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రాలతో మీకు బాగా దగ్గరైన సంతోష్ శోభన్ సరసన ఈ సినిమాలో నటించా. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ‘కొత్తగా ఏం చూపిస్తారని మేం సినిమాకి వెళ్లాలి?’ అని అంటారా.. ఇది అడ్వంచర్ యాక్షన్ కామెడీ. 40 శాతం సినిమా అడవి నేపథ్యంలోనే సాగుతుంది. మీరు ఊహించలేని ఎన్నో మలుపులుంటాయి.
ప్రారంభం నుంచి శుభం కార్డు పడేవరకూ మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది. విభిన్న లేయర్స్ ఉన్న స్క్రిప్టు ఇది. ఇందులోని కామెడీ సందర్భానికి తగ్గట్టే ఉంటుంది కానీ అతికించినట్టు ఉండదు. నేను ట్రావెల్ వ్లాగర్ వసుధగా కనిపిస్తా. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసేందుకు దేశమంతా తిరుగుతుంటా. ఆ ప్రయాణంలోనే హీరోని కలుస్తా. తనూ ట్రావెల్ వ్లాగరే. మా ఇద్దరి పరిచయం ఎక్కడి వరకు వెళ్లింది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. సంతోష్ శోభన్ మంచి నటుడు. సినిమా అంటే ఆయనకు ప్యాషన్. అలాంటి వ్యక్తితో కలిసి నటించినందుకు సంతోషించా. మేర్లపాక గాంధీ స్పష్టత ఉన్న దర్శకుడు. ఆయన చెప్పిందే నేను ఫాలో అయిపోయా. ఈ సినిమా జర్నీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిత్రం వల్లే తొలిసారి నేను విదేశానికి (థాయ్‌లాండ్) వెళ్లా’’
‘‘చిట్టి’ పాత్ర నాకు ఓ ఎమోషన్. మీరు నాపై కురిపించిన ప్రేమకు ఆనందంతోపాటు బాధ్యత పెరిగింది. అందుకే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నా. ప్రస్తుతం తమిళంలో సుశీంధిరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. నా నటనకు మెచ్చిన ఆయన.. ‘25 ఏళ్లు ఇండస్ట్రీలో పక్కాగా ఉంటావ్’ అని ప్రశంసించినప్పుడు నాకు మాటలు రాలేదు. ఆ సినిమాలో విజయ్ ఆంటోని హీరో. తెలుగులో రవితేజ సరసన ‘రావణాసుర’ చిత్రంలో నటిస్తున్నా. ఓ వెబ్‌సిరీస్ (హిందీ)లో మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫలానా జానర్లోనే సినిమాలు చేయాలి, అలాంటి పాత్రలే పోషించాలనే పరిధులు నాకు లేవు. దర్శకత్వంపై ఆసక్తి ఉంది. కానీ, ఇప్పుడప్పుడే మెగాఫోన్ పట్టుకోవాలని లేదు. దానికి పదేళ్ల సమయం తీసుకుంటా. అప్పటి వరకూ నన్ను ఇలానే ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా’’ ... మీ ఫరియా అబ్దుల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్