Farzi: ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్ ‘ఫర్జీ’..!
Farzi: షాహిద్‌కపూర్, రాశీఖన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘ఫర్జీ’ అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలకు దీటుగా వెబ్‌సిరీస్‌లు అలరిస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. కంటెంట్ బాగుంటే ఐదారు గంటల నిడివిగల వెబ్‌సిరీస్‌ను సైతం అలవోకగా చూసేస్తున్నారు. ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి, రాశీఖన్నా (raashii khanna) కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘ఫర్జీ’ (Farzi) రికార్డు సృష్టించింది. కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే కాదు, ఇండియన్ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కథానాయకుడు షాహిద్‌కపూర్ ఆనందం వ్యక్తం చేశారు.
గత నెలలో విడుదలైన ఫర్జీని ఇప్పటివరకూ 37 మిలియన్ వ్యూవర్స్ వీక్షించినట్లు (సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ ఆధారంగా) ఓర్‌మ్యాక్స్ మీడియా పేర్కొంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అజయ్ దేవ్‌గణ్ ‘రుద్ర’ (32.5 మిలియన్ వ్యూవర్స్) జితేంద్రకుమార్ ‘పంచాయత్’ (29.6 మిలియన్ వ్యూవర్స్), పంకజ్ త్రిపాఠి ‘క్రిమినల్ జస్టిస్’ (29.1మిలియన్ వ్యూవర్స్) ఆదిత్య రాయ్‌కపూర్ ‘ది నైట్ మేనేజర్’ (27.2 మిలియన్ వ్యూవర్స్)లను ‘ఫర్జీ’ దాటేసింది.
రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ఫర్జీ’ ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. ఏ పెయింటింగ్‌నైనా అచ్చుగుద్దినట్లు గీయగల టాలెంట్ ఉన్న యువకుడు సందీప్ అలియాస్ సన్నీ (షాహిద్ కపూర్). తన తాత నడుపుతున్న పత్రిక కారణంగా అప్పులు పాలవడంతో దొంగ నోట్లను ముద్రించాలని సన్నీ ప్లాన్ వేస్తాడు. మరోవైపు దేశంలో దొంగనోట్ల చలామణీ అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ వేదనాయగం (విజయ్ సేతుపతి) ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలాంటి సమయంలో సన్నీ దొంగ నోట్లను ఎలా ముద్రించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటిని నుంచి ఎలా బయటపడ్డాడు? తెలియాలంటే ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్ చూడాల్సిందే! దీనికి కొనసాగింపుగా రెండో భాగం కూడా తెరకెక్కనుంది. మొదటి సిరీస్‌లో చాలా విషయాలను చర్చించకుండా వదిలేశారు. అయితే, ‘సిరీస్2’ ఎప్పుడు వస్తుందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
viral News: సిగరెట్లు తాగొద్దన్నందుకు రణరంగంగా మారిన యూనివర్శిటీ..!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్ స్వామి
-
India News
పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!
-
General News
TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు
-
World News
USA: విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్.. సానిక్ బూమ్‌తో హడలిన వాషింగ్టన్