వస్తోందండి నవ్వుల బండి.. నవ్వేందుకు సిద్ధంకండి

ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు ‘FCUK’(ఫాదర్‌, చిట్టి, ఉమ, కార్తీక్‌) బండి సిద్ధమైంది. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఇటీవల టీజర్‌తో అలరించింది. దాంతో సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతుందో రుచి చూపించింది. తాజాగా.. చిత్రబృందం విడుదల తేదీని కూడా ప్రకటించింది.

Published : 19 Jan 2021 01:25 IST

హైదరాబాద్‌: ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు ‘FCUK’(ఫాదర్‌, చిట్టి, ఉమ, కార్తీక్‌) బండి సిద్ధమైంది. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఇటీవల టీజర్‌తో అలరించింది. దాంతో సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతుందో రుచి చూపించింది. తాజాగా.. చిత్రబృందం విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 12న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

ఈ సినిమాలో ఫాదర్‌(ఫణిభూపాల్‌)గా జగపతిబాబు, (కార్తీక్‌)గా రామ్‌ కార్తీక్‌, (ఉమ)గా అమ్ముఅభిరామి కీలక పాత్రల్లో నటించారు. విద్యా సాగర్‌రాజు దర్శకుడు. రంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..

బాయ్‌ఫ్రెండ్‌ ఫొటో పంచుకున్న కాజల్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని