Fatima Sana: హిందీ ‘అరువి’లో ఫాతిమా

‘దంగల్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ లాంటి భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నాయిక ఫాతిమా సనా షేక్‌. ఇప్పుడు ఈ కథానాయిక తొలిసారి నాయికా ప్రాధాన్య...

Published : 14 May 2021 13:00 IST

ముంబయి: ‘దంగల్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ లాంటి భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నాయిక ఫాతిమా సనా షేక్‌. ఇప్పుడు ఈ కథానాయిక తొలిసారి నాయికా ప్రాధాన్య చిత్రంలో నటించనుంది. తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘అరువి’. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో అదితి బాలన్‌ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు అదితి పాత్రలో ఫాతిమా నటించనుంది. ఈ విషయం గురించి ఫాతిమా మాట్లాడుతూ ‘‘ఇదో మంచి కథ, ఆసక్తిగా సాగే చిత్రమని మాత్రమే ‘అరువి’ గురించి నేను ప్రస్తుతానికి చెప్పగలను. ఒక అమ్మాయి, ఆమె ప్రయాణమే ఈ కథ. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందా? లేదా? అనేది నాకు ముఖ్యం కాదు. ఆ ఉద్దేశంతో ఈ సినిమాని అంగీకరించలేదు. నిజాయితీగా నా పాత్రకు న్యాయం చేయగలుగుతానా? లేదా? అనేదే చూసుకున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇది రీమేక్‌  అయినా కచ్చితంగా మరిన్ని తాజా అంశాలు ఇందులో ఉండనున్నాయి’’అని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని