Published : 24/08/2020 00:35 IST

సినిమాల చిత్రీకరణకు అనుమతిచ్చిన కేంద్రం

దిల్లీ: ఆన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా చిత్రీకరణలు జరుపుకోవచ్చని తెలిపింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆదివారం ఉదయం ఓ ప్రకటనలో చిత్రీకరణలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. మొట్టమొదటి లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25వ తేదీ నుంచి ఎక్కడి షూటింగ్‌లు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కొన్ని రాష్ట్రాల్లో షూటింగులు ప్రారంభించినప్పటికీ  కరోనా ఉద్ధృతి పెరగడంతో నిలిపివేశారు. తాజాగా కేంద్రం ఇచ్చిన అనుమతులతో మళ్లీ సినిమా, టీవీ సీరియల్స్‌ చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి. 

కేంద్రం మార్గదర్శకాలివే...
* బహిరంగ ప్రదేశాల్లో యూనిట్‌ సిబ్బంది మొత్తం ఫేస్‌ మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలి.
* ఆరోగ్య సేతు యాప్‌ను నటీనటులంతా ఉపయోగించాలి. 
* షూటింగ్‌ సమయాల్లో విజిటర్లను అనుమతించవద్దు.
* మేకప్‌ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి.
* సాధ్యమైనంత తక్కువ మంది సిబ్బందితో చిత్రీకరణ జరిపేలా చూడాలి.
* థియేటర్లలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి.
* టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి.
* షూటింగ్‌ పాయింట్‌ వద్ద సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి. 
* చిత్రీకరణ జరిపే ప్రాంతంలో తాత్కాలిక ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని