FCC: నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దు: ఫిల్మ్‌ ఛాంబర్‌

వేతనాలు పెంచాలని చేపట్టిన సినీ కార్మికుల నిరసన, నిర్మాతల మండలి   సమాధానంపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి  స్పందించింది.

Published : 23 Jun 2022 01:39 IST

హైదరాబాద్‌: వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల చేపట్టిన నిరసన, దానికి నిర్మాతల మండలి (Producers Council) సమాధానంపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (Film Chamber of Commerce) స్పందించింది. ఈ మేరకు నిర్మాతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 15 రోజులపాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సూచించింది. ఫిల్మ్ చాంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కార్మికులకు వేతనాలు చెల్లించవద్దని కోరింది. సినిమా చిత్రీకరణల వివరాలు ఎప్పటికప్పుడు ఫిల్మ్ చాంబర్‌కు తెలిపాలని, నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొవద్దని పేర్కొంది. కార్మిక సంఘాల ఒత్తిళ్లకు ఎవరూ గురికావొద్దని, నిర్మాతల మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలందరికీ తెలియజేస్తామని చలన చిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని