Film Federation: ఆందోళన విరమించిన సినీ కార్మికులు... దిల్‌రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ

సినీ కార్మికులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. వేతనాలపెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో రేపటి నుంచి సినిమా

Updated : 23 Jun 2022 16:58 IST

హైదరాబాద్‌: సినీ కార్మికులు ఎట్టకేలకు ఆందోళన విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు వెల్లడించారు. వేతనాల పెంపుపై రెండు రోజుల నుంచి ఆందోళనబాట పట్టిన కార్మిక సంఘాలు... సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చొరవతో నిర్మాతల మండలితో చర్చలు జరిపాయి. 

సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై సుమారు 2గంటల పాటు చర్చించారు. కార్మికుల వేతనాలపై దిల్‌రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపునకు నిర్మాతల మండలి అంగీకారం తెలపడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు యథాతథంగా జరుగుతాయని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని