Katragadda Muraari: ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూశారు.
చెన్నై: ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూశారు. 1944 జూన్ 14న విజయవాడలో జన్మించిన కాట్రగడ్డ.. యువచిత్ర ఆర్ట్స్ పేరుతో 90వ దశకం వరకు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. సీతామహలక్ష్మి, గోరింటాకు, జానకీరాముడు, నారి నారి నడుమ మురారి, అభిమన్యుడు, త్రిశూలం, సీతారామ కల్యాణం, శ్రీనివాస కల్యాణం, జేగంటలు ఆయన తీసిన చిత్రాల్లో కొన్ని. డాక్టర్ చదువు మానేసి మరీ దర్శకుడవుదామని చిత్రరంగ ప్రవేశం చేసిన మురారి చివరికి నిర్మాతగా మారారు. మురారి నిర్మించిన అన్ని చిత్రాలకూ కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. 2012లో ‘నవ్విపోదురు గాక’ పేరుతో ఆత్మకథ రాశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-01-2023)
-
India News
Anand Mahindra: ఇ-రూపీ వాడి.. పండ్లు కొన్న మహీంద్రా..!
-
Sports News
Shubman Gill: శుభ్‌మన్ గిల్.. భవిష్యత్‌లో క్రికెట్‌ను శాసిస్తాడు: పాక్ మాజీ కెప్టెన్
-
Movies News
బాలకృష్ణ మాటల్లో వివాదం కనిపించడం లేదు: ఎస్వీ రంగారావు మనవళ్లు
-
General News
Pawan Kalyan: పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు: పవన్ కల్యాణ్
-
Politics News
Erode East bypoll: ఇళంగోవన్‌కే బేషరతుగా మద్దతు ఇస్తున్నాం: కమల్ హాసన్