- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
MS raju: ఎవరేమనుకున్నా కాలంతో పాటే మారిపోవాలనుకున్నా: సుమంత్ అశ్విన్, ఎమ్మెస్ రాజు
రెండేళ్లలో సుమంత్‌తో నా కలల ప్రాజెక్టు చేస్తా!
ఇంటర్నెట్ డెస్క్: శత్రువు, వర్షం, నువ్వొస్తానంటే నేవద్దంటానా..సినిమాల పేర్లు చెప్పగానే సూపర్ డూపర్ హిట్లు..అద్భుతమైన పాటలున్నాయనిపిస్తుంది. ఆ సినిమాలను నిర్మించిన నిర్మాత ఎమ్మెస్ రాజు. దేవీశ్రీలాంటి క్రేజీ సంగీత దర్శకుడిని సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. కొంతకాలం క్రితం తండ్రి స్ఫూర్తితో హీరోగా సుమంత్ అశ్విన్ సినీ తెరంగేట్రం చేశారు. యువతను ఆకట్టుకునే చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ యువహీరో తన తండ్రితో కలిసి ఈటీవీ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు.. ఎన్నో సినీ విశేషాలను పంచుకున్నారు.
మిమ్మల్ని ఒకప్పుడు సంక్రాంతి రాజు అనేవారు. ఎలా వచ్చిందాపేరు..?
ఎమ్మెస్ రాజు: అనుకొని, అనుకోకుండా కొన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చాయి. పెద్ద హిట్ అయ్యాయి. అందుకే ఆ పేరు వచ్చింది.
మీరు నిర్మాతగా ఎన్ని సినిమాలు తీశారు..?
ఎమ్మెస్ రాజు: దాదాపుగా 13, 14 సినిమాలు చేశాను. నా మొదటి సినిమా వెంకటేష్, విజయశాంతితో శత్రువు సినిమా తీశా. నా బ్యానర్ అప్పుడే పెట్టా. తర్వాత విజయశాంతితో పోలీస్ లాకప్ చేశా. ‘దేవి’ నాలుగో సినిమా. ఆ సినిమాకు దేవిశ్రీని పరిచయం చేశారు.
మీ సినిమాలకు చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. దేవిశ్రీని ఎందుకు పరిచయం చేయాలనుకున్నారు..?
ఎమ్మెస్ రాజు: వాళ్ల నాన్న సత్యమూర్తి రచయిత. నాకు బాగా పరిచయం. ఒకరోజు దేవి సినిమాకు ఇళయరాజా అయితే బాగుంటుందని కోడి రామకృష్ణ చెబితే వెళ్లాను. ఆయనతో మాట్లాడే అవకాశం రాలేదు. పక్కనే ఉన్న సత్యమూర్తి ఇంటికి వెళ్లా. అక్కడికి వెళ్లగానే బుడ్డోడు 15, 16 ఏళ్లు ఉంటాయనుకుంటా. గదిలో కూర్చొని చిన్న కీ బోర్డు పెట్టుకొని వాయిస్తున్నాడు. తలుపేసి ఉన్నా లోపలికి వెళ్లాలనిపించి వెళ్లా.. చిన్న చాప వేసుకొని వాయిస్తున్నాడు. నన్ను చూసి అంకుల్ రండి అన్నాడు. దేవుడి అతడి కెరీర్ అక్కడ రాసి పెట్టి ఉంటాడు. నా ద్వారా పరిచయం చేయాలని ఉంది. ‘సరదాగా ఒక సాంగ్ నేపథ్యం చెబుతా..పాట ట్యూన్ ఇవ్వాల’ని అడిగా. రెండ్రోజుల తర్వాత దేవి ఫోన్ చేశాడు. అప్పుడు భారీ వర్షం పడుతోంది. మీరు చెప్పిన ట్యూన్ సిద్ధంగా ఉంది. రండి వినిపిస్తా అన్నాడు. లేదంటే నేనే వస్తా..అంటే సరదాగా నాన్నను కలవడానికి నేనే వస్తానని చెప్పా. వాళ్ల ఇంటి దగ్గర వర్షం పడి నీరు నిలిచిపోయింది. కారు ఆగిపోయింది. తొలిసారిగా ట్యూన్ విందామంటే ఇదేంటని భావించా. ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నా..చిన్న కుర్రాడు నిరుత్సాహ పడుతాడని వెళ్లాలనుకున్నా.. ప్యాంట్ పైకి లాగి నీటిలోనే అర కిలోమీటరు దూరం వెళ్లా. సాంగ్ విన్నా.. సంగీత దర్శకుడిగా నిర్ణయించా. బాలు ఒక పాట పాడిన తర్వాత బాగుందనుకున్నా. దేవి మళ్లీ వన్స్‌మోర్ అన్నాడు. అప్పుడు బాలుగారికి కోపం వచ్చింది. అయినా ఒప్పించి పాడించాను. రీరికార్డింగ్ వేరే వాళ్లతో చేద్దామనుకున్నా. దేవి ఒక రీలు చేస్తే..చాలా సూపర్బ్‌గా ఉంది. అతన్నే పూర్తి చేయాలని చెప్పా. ఇటీవల నా బర్త్‌డేకి మ్యూజిషియన్లతో పాట రూపంలో చెప్పడం మరచిపోలేను.
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ కాకుండా ఆర్టిస్టులను పరిచయం చేశారా..?
ఎమ్మెస్ రాజు: హీరోగా మా అబ్బాయిని, వర్షం సినిమాలో త్రిషను పరిచయం చేశాను. నా సినిమాతో హీరో కేరీర్ ఊపందుకున్న వారిలో మహేష్‌బాబు, ప్రభాస్, సిద్దార్థ ఉన్నారు. ప్రభుదేవాను డైరెక్టర్‌గా పరిచయం చేశాను.
సమంత్ నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని కోరిక ఉండేదా..? స్క్రీన్ మీద హీరోలను చూసి నేను కూడా హీరో కావాలనుకున్నావా..?
సుమంత్ అశ్విన్: అప్పట్లో చాలా మందిని చూశాను. వాళ్లను చూసి నేను అలా చేయగలనా అనుకున్నా..కారణం నేను చాలా లావుగా ఉన్నా. 90-100 కిలోలు ఉండేవాడిని. మెల్ల మెల్లగా సెట్‌లోకి వెళ్లేవాడిని. ఆ సమయంలో టెక్నికల్ సైడ్‌పై ఆసక్తి పెరిగింది. డైరెక్టర్, ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా టెక్నికల్ వైపు వెళ్దామనుకున్నా. చిన్న చిన్న శుభ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేస్తుంటే అందరూ మెచ్చుకునే వారు. దీంతో మెల్లగా బరువు తగ్గా. తర్వాత హీరో కావాలనే ఆలోచన మొదలయ్యింది.
హీరోగా ఎన్ని సినిమాలు చేశావు..?
సుమంత్ అశ్విన్: పదకొండు సినిమాలు చేశా. మొదట తూనీగా..తూనీగా. మా నాన్నే నాకు డైరెక్టర్. సెట్లో, ఇంట్లో కూడా సినిమా ముచ్చట్లే ఉంటాయి. ఆయనకు 24×7 సినిమాలే. నార్త్‌లో హాలిడే స్పాట్‌కు తీసుకెళ్లారు. నేను ఎంజాయ్ చేశా. నాన్న రూం నుంచి బయటకు రాలేదు. తీరా చూస్తే వర్షం స్క్రీన్‌ప్లే అంతా రాసుకున్నారు.
శత్రువు, వర్షం లాంటి మంచి సినిమా తీసిన మీరు డర్టీహరీ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది...?
ఎమ్మెస్ రాజు: అది కూడా కుటుంబ కథా చిత్రమే. చిన్న అడల్ట్ కంటెంట్ ఉంది తప్ప ఏమీ లేదు. విడుదలకు ముందే వివాదం..విడుదల తర్వాత చాలా మంది కాల్ చేశారు. మార్పుతో మాటే ముందుకు వెళ్లా. హిట్ ఇచ్చి కొడితే తప్ప మనవైపు చూడరనుకున్నా. ఎవరేమనుకున్నా డర్టీహరీ లాంటి సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు చేసే సినిమా ‘7 డేస్.. 6 నైట్స్’. రియాల్టీ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ల జీవితం, వాళ్ల ఎమోషన్లు, ఎంజాయ్‌మెంట్ ఏంటో చూపించా.
నిర్మాతగా ఉండే రాజు గారు సడన్‌గా డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నారు..?
ఎమ్మెస్ రాజు: డైరెక్టర్‌గా ముందే అయ్యా. కానీ సక్సెస్ రాలే. నిర్మాతగా ఎవరినైనా పెట్టి తీయొచ్చు..కానీ రచన, డైరెక్టర్‌గా ఉండటం ఇష్టం..నా మీద నమ్మకంతోనే డర్టీహరీ సినిమా తీశా. ఇతర హీరోలతో చేయాలనుకుంటే ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. కొన్ని నిబంధనలతో సినిమా చేశా. అలా చేస్తారో లేదోననే భయంతోనే సినిమాలు చేయడం లేదు. ఇంకొక కారణం ఏంటంటే గతంలో లాంటి కథలు ఆలోచించ లేకపోవడం, అదే సమయంలో అబ్బాయి కెరీర్ వైపు దృష్టి పెట్టడంతో పదేళ్లు దూరంగా ఉండిపోయాను.
‘ఒక్కడు’కు చార్మినార్ సెట్ వేశారు. సినిమా చూసినోళ్లు అక్కడ ఇన్ని రోజులు ఎలా షూటింగ్ చేశారనుకున్నారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది.,?
ఎమ్మెస్ రాజు: అది గుణశేఖర్ ఆలోచన. నిజంగా అక్కడే చేస్తే అనుకున్నట్టుగా సినిమా తీయలేం..ఖర్చు ఎక్కువైనా అందుకే సెట్ వేశాం. మహేష్ కూడా వద్దన్నారు. డైరెక్టర్ విజన్ కోసం వెళ్దామనుకున్నాం. ఆ సినిమా మంచి హిట్. అందరికీ బాగా ఉపయోగపడింది.
మీరు తీసిన సినిమాలకు ఎన్ని కథలు ఇచ్చారు..?
ఎమ్మెస్ రాజు: 27 ఏళ్లకు పెళ్లయ్యింది. అబ్బాయి పుట్టాడు. కోడి రామకృష్ణతో అనుబంధం ఉంది. అప్పుడే ‘శత్రువు’ కథ అనుకున్నాం. నేను బిజీగా ఉన్నా..ఎవరైనా రైటర్ దగ్గరకు వెళ్లి కథను డెవలప్ చేయండని సలహా ఇచ్చారు. సినిమాలకు సంబంధించిన పుస్తకంలో చూసి సత్యమూర్తిని ఎంపిక చేసుకున్నా. ఫోన్ చేసి మాట్లాడా. అక్కడి నుంచి జర్నీ ఆరంభం అయ్యింది. ఆ కథ విని డ్రైగా ఉందని కోడి రామకృష్ణ అన్నారు. రెండ్రోజుల తర్వాత మళ్లీ కలిశాం..ఆ సమయంలో డైరెక్టర్‌కు ఫోన్ వస్తే ఫోన్ ఎవడు కనిపెట్టాడురా బాబూ అనడంతో దాన్నే కోట మేనరిజంగా సినిమాలో పెట్టడంతో సక్సెస్ అయ్యింది. అప్పటి నుంచి సినిమాలో స్థానికత, కామెడీ తప్పనిసరిగా ఉండాలని అనుకున్నా.
సుమంత్ ప్రొడక్షన్‌లో ఎన్ని సినిమాలు చేశారు..?
ఎమ్మెస్ రాజు: దాదాపుగా 13, 14 సినిమాలు చేశా. చివరగా మస్కా నిర్మించాం. ఇప్పుడు సుమంత్, మా అమ్మాయి కలిసి వైల్డ్‌హనీ ప్రొడక్షన్ పెట్టారు.
సుమంత్ ఫొటో చూసి అప్పటి రైటర్, ఇప్పటి గొప్ప డైరెక్టర్ పెద్ద హీరో అవుతావని చెప్పారట..?
ఎమ్మెస్ రాజు: అది త్రివిక్రమ్ శ్రీనివాస్. వీడియో షూట్‌ను త్రివిక్రమ్, చోటా కలిసి చూశారు. వాటిని చూసి ఎప్పటికయినా పెద్ద హీరో అవుతాడని అన్నారు. అది ఈ 7డేస్, 6నైట్స్‌తో అవుతాడని అనిపిస్తుంది.
మీరు చాలా మందికి చాలా కథలు ఇచ్చారు. మీవాడికి మంచి కథ సిద్ధం చేశారా..?
ఎమ్మెస్ రాజు: సుమంత్ జోనర్‌లో మంచి సినిమాలు చేయాలని ఉంది. చిన్న చిన్న సినిమాలతో మొదలెట్టి..నేను అనుకున్న సినిమా చేస్తా. ఓ రెండేళ్లు పట్టొచ్చు.
పోలీస్ లాకప్ ఎక్కడెక్కడా తీశారు..? అవుట్‌డోర్‌లో చేసినపుడు జనంలోంచి ఎవరో ఏదో అనడంతో విజయశాంతి ఆగ్రహించారట..?
ఎమ్మెస్ రాజు: విజయశాంతి ఎండ, వాన ఏదీ లెక్క చేయరు. రైల్వే ట్రాక్ దగ్గర ఫైటింగ్ సీను..ఆమె పల్టీ కొడుతోంది. ఎవరో కామెంట్ చేయడంతో కోపంతో మాస్టర్ దగ్గర రాడ్ ఉంటే తీసుకొని వాళ్ల పైకి వెళ్లింది. మేడమ్ సారీ అనడంతో.. ఎంత కష్టపడి చేస్తున్నామో చూడు అంటూ అరిచారు. ఎప్పుడు కలిసినా ఆనాటి సీను గుర్తు చేసుకుంటాం.
చిన్నపుడు నాన్న నిన్ను పాఠశాలలో అల్లరి చేశావని కొట్టారట..?
సుమంత్ అశ్విన్: మరీ ఎక్కువగా కాదు..రెండు, మూడు సార్లు కొట్టారు. అల్లరి బాగా చేస్తున్నానని ప్రిన్సిపల్ పేరేంట్స్‌ను తీసుకు రమ్మంటే నాన్నకు చెబితే ఏం అంటారోనని అమ్మకు చెప్పేవాడిని. అమ్మ వచ్చి ప్రిన్సిపల్‌ను కలిసేది. ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు పాఠశాల విడిచిపెట్టారు. అందరూ వెళ్లిపోతున్నారు. అమ్మానాన్న ఎవరూ రాలేదు. పాఠశాల దాటి ఇంటి బాట పట్టా. నాన్న పాఠశాలకు వచ్చినట్టున్నారు. నేను కనపడలేదు. కంగారుగా ఇంటికి వచ్చారు. కొట్టినట్టు గుర్తు లేదు కానీ కొట్టి ఉంటారు. కాలేజీలోనూ గోడలు దూకి వెళ్లి రాత్రిపూట ఇడ్లీ తిని వచ్చేవాళ్లం.
సుమంత్‌ను ఒక ఇంటివాడిని ఎప్పుడు చేస్తున్నారు..?
ఎమ్మెస్ రాజు: గత ఏడాది చేసేశాం. కొవిడ్ ఉండటంతో ఎవరికి చెప్పలేదు. పిలవలేదు కూడా..పిలిచినా వచ్చే అవకాశం లేని రోజులవి. అరేంజ్డ్ మ్యారేజీ చేశాం.
నీ సినిమాలకు నాన్నగారి ఇన్‌వాల్వ్‌మెంటు ఎంత ఉంటుంది..?
సుమంత్ అశ్విన్: ఆయన ఇన్‌వాల్వ్ కాకపోయినా నేను వెళ్లి చెబుతాను. ఆయన ఫర్‌ఫెక్టుగా జడ్జ్ చేయగలరు. అందుకే అడుగుతాను.
ఇప్పుడున్న హీరోలలో ఎవరంటే ఇష్టం..?
సుమంత్ అశ్విన్: ఒక్కో హీరోది..ఒక్కో శైలి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పలేను. మహేష్‌తో ఎక్కువగా కనెక్టు అవుతా. ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటారు. వెంకటేశ్ చాలా ఇష్టం.
పెద్ద హీరో సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆఫర్ ఇస్తే చేస్తావా..?
సుమంత్ అశ్విన్: కచ్చితంగా చేస్తా. ఆ పాత్ర చేస్తే నాకు సహాయపడుతుందనుకుంటే చేస్తాను. నేను ఇలాగే ఉండాలని సరిహద్దు గీసుకోలేదు. పాత్రలతో ప్రయోగాలు చేయాలని ఉంది.
7డేస్ 6నైట్స్ ఇంగ్లిష్ సినిమా కూడా వచ్చినట్టు ఉంది. దానికి దీనికి సంబంధం ఉందా..?
ఎమ్మెస్ రాజు: అది జంగిల్ అడ్వంచర్ సినిమా.ఇది రియాల్టీ షో. ఏ సంబంధం లేదు.
ఒక్కడు సినిమా సమయంలో భూమిక ఫైటర్‌పై సీరియస్ అయినట్టుంది. ఏ విషయంలో జరిగింది..?
ఎమ్మెస్ రాజు: ఒక్కడులో మహేష్, భూమిక యాక్షన్ సీన్ ఉంది. వర్షం పడుతుంటే రౌడీలు వెంటపడుతుంటారు. మేకల మంద పక్కనుంచి పరిగెత్తాలి. మంద నుంచి మేక పిల్ల ఒకటి జంప్ చేసింది. ఫైట్ మాస్టర్ అసిస్టెంట్ ఆ పిల్లను తీసుకొచ్చి గుంపులో విసిరేశాడు. వెంటనే భూమిక లేచి ఇంగ్లిష్‌లో భయంకరంగా తిట్టింది. చెట్టు కొమ్మ అడ్డం వస్తే కొట్టేయపోతుంటే వద్దని కోపం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
-
Crime News
Chocolate: గోదాంలోకి చొరబడి చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ధర రూ.17లక్షలు!
-
General News
Telangana News: వాసవి గ్రూప్ స్థిరాస్తి సంస్థపై ఐటీ దాడులు.. 40 బృందాలతో సోదాలు
-
Politics News
AIADMK: పళనికి షాక్.. పన్నీర్‌కు ఊరట
-
India News
Railway Ticket for Kids: రైళ్లల్లో పిల్లలకు ‘ప్రత్యేక టికెట్’ వార్తలపై కేంద్రం స్పష్టత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- S Jaishankar: కుమారుడితో రెస్టారెంట్‌కు కేంద్రమంత్రి.. తర్వాత ఏం జరిగిందంటే..?
- Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
- Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్రామ్నూ ఇలాగే కొట్టారు..