FIR: ‘అనుమానంతో జీవితం నాశనం’.. ఉత్కంఠగా ‘ఎఫ్‌ఐఆర్‌’ ట్రైలర్‌

‘అనుమానంతో ఒకడి జీవితాన్ని నాశనం చేస్తే ఎవరో ఒకరు తిరిగి దెబ్బకొడతారనే భయం పుట్టాలి’ అని అంటున్నారు విష్ణు విశాల్‌.

Published : 03 Feb 2022 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అనుమానంతో ఒకడి జీవితాన్ని నాశనం చేస్తే.. ఎవరో ఒకరు తిరిగి దెబ్బకొడతారనే భయం పుట్టాలి’ అని అంటున్నారు విష్ణు విశాల్‌. ఈయన హీరోగా మను ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. ఉగ్రవాదం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా నటుడు నాని ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘టెర్రర్‌ పుట్టాలి. టెర్రరిజం పెరగాలి’ అనే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఐఎస్‌ఐ ఉగ్రవాది అబూ బక్కర్‌ అబ్దుల్లా పరిశోధనల వల్ల.. ఇర్ఫాన్‌ అహ్మద్‌ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అన్న కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలో నటించారు. మంజిమా మోహన్‌ కథానాయిక. వీవీ స్టూడియో సంస్థ నిర్మించింది. ఈ సినిమాకి సంగీతం: అశ్వంత్‌, ఛాయాగ్రహణం: అరుల్‌ విన్సెంట్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని