FIR: ‘ఎఫ్‌ఐఆర్‌’ను నిషేధించిన మూడు దేశాలు!

తమిళ నటుడు విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. తీవ్రవాదం, ఉగ్రదాడి కుట్రలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని

Published : 12 Feb 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. తీవ్రవాదం, ఉగ్రదాడి కుట్రలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని మూడు దేశాలు మాత్రం నిషేధించాయి. అవే మలేషియా, కువైట్‌, ఖతర్‌. భారత్‌లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ నుంచి యూ/ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం.. ఆ మూడు దేశాల్లోని స్థానిక సెన్సార్‌ బోర్డుల అనుమతి తీసుకోలేదట. అందుకే ‘ఎఫ్‌ఐఆర్‌’ను నిషేధించినట్లు తెలుస్తోంది.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకొని ఓ సంస్థలో పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్న హీరోని పోలీసులు ఉగ్రవాదిగా భావించి అరెస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అవేంటి? అసలు హీరో ఉగ్రవాదా? అమాయకుడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హీరో విష్ణు విశాలే ఈ చిత్రాన్ని నిర్మించగా.. మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్‌ నటించారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, రైజా విల్సన్‌, రెబా మోనికా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అశ్వంత్‌ సంగీతం సమకూర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని