Unstoppable: ‘అన్‌స్టాపబుల్‌’ వ్యాఖ్యాతగా ఫస్ట్‌ ఛాయిస్‌ బాలయ్య కాదట!

ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షో కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో పాల్గొన్న తారల ముచ్చట్ల కన్నా.. బాలయ్య సందడే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలతో బాలయ్య జరిపే సరదా సంభాషణకు, టైమింగ్‌కి

Published : 26 Jan 2022 17:49 IST

హైదరాబాద్‌: ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షో కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో పాల్గొన్న తారల ముచ్చట్ల కన్నా.. బాలయ్య సందడే ప్రేక్షకుల్ని అలరించింది. సెలబ్రిటీలతో బాలయ్య సరదా సంభాషణలకు, టైమింగ్‌కి ఆయన అభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అయితే, ఈ షోకి సంబంధించిన ఓ వార్త తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌షో నిర్వాహకులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తొలుత బాలకృష్ణని అనుకోలేదట. టాలీవుడ్‌లో మరో సీనియర్‌ నటుడు విక్టరీ వెంకటేశ్‌ వ్యాఖ్యాతగా ఉంటే బాగుంటుందని భావించారట. ఈ మేరకు ఆయన్ను సంప్రదించగా.. వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వెంకటేశ్‌ అంగీకరించలేదు. హీరో నానిని పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరగా బాలకృష్ణను సంప్రదించారట. ఆయన కూడా తన కెరీర్‌లో ఇదీ ఒక కొత్త అధ్యాయంలా ఉంటుందని ‘ఓకే’ చెప్పేశారు. అలా ప్రారంభమైన ఈ టాక్‌ షో విజయవంతంగా కొనసాగుతూ చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 4న ప్రసారం కానున్న ‘అన్‌స్టాపబుల్‌’ చివరి ఎపిసోడ్‌కి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని