First Day First Show: ఓటీటీలోకి ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’.. ఎప్పుడంటే?

‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. శ్రీకాంత్‌, సంచిత బసు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.

Published : 14 Sep 2022 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన నటులు శ్రీకాంత్‌, సంచిత బసు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ (First Day First Show). వంశీధర్‌ గౌడ్‌, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ‘ఆహా’ (Aha)లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. నాటి ‘ఖుషి’ (kushi) సినిమా విడుదల ఇతివృత్తంగా రూపొందిన చిత్రమిది. ఆ చిత్రాన్ని తొలి రోజు తొలి ఆట చూడాలనుకున్న కథానాయికకు టికెట్‌ ఇచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ‘ఖుషి’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోని నాయకానాయికలు కలిసి చూశారా, లేదా? అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులు ఆశించనంతగా మెప్పించలేకపోయింది. శ్రీజ ప్రొడక్షన్స్‌, మిత్రవింద మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కె.వి. కథ అందించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని