
First Day First Show: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రమోషన్స్‌కి రావడం ఆనందంగా ఉంది: నాగ్ అశ్విన్
ఇంటర్నెట్ డెస్క్: ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ లాంటి సినిమాలను అందించిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. దీని అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ చిత్ర పోస్టర్‌ను యువ దర్మకుడు నాగ్ అశ్విన్ సోమవారం ఆవిష్కరించారు. ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాతో వంశీ, లక్ష్మీ నారాయణలు దర్శకులుగా పరిచయమవుతున్నారు.
ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సినిమాల్లో ‘ఆపద్బాంధవుడు’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రమోషన్స్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సంస్థలో నేను భవిష్యత్తులో సినిమా చేస్తా. దర్శకుడు వంశీ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. ఈ కథ గురించి చిన్న లైన్ చెప్పినప్పుడు రెండు నిమిషాలు నవ్వుకున్నా. ఈ సినిమా ‘జాతిరత్నాలు’ కంటే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకులు మాట్లాడుతూ త్వరలోనే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. రథన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కె.వి అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, గంగవ్వ తదితరులు నటించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
-
Politics News
Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
-
Movies News
Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో అమితాబ్.. నెట్టింట ఫొటో చక్కర్లు
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం