First Day First Show: ‘జాతిరత్నాలు’ తరహాలో..

‘‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చాలా విభిన్నమైన చిత్రం. ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తుంది’’ అన్నారు వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీ నారాయణ.

Updated : 18 Aug 2022 13:56 IST

‘‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ చాలా విభిన్నమైన చిత్రం. ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తుంది’’ అన్నారు వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీ నారాయణ. వీళ్లిద్దరూ దర్శకులుగా పరిచయమవుతున్న ఈ సినిమాకి దర్శకుడు కె.వి.అనుదీప్‌ కథ అందించారు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మించారు. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకులు వంశీధర్‌, లక్ష్మీ నారాయణ.

‘‘ఇలాంటి చక్కటి కథతో దర్శకులుగా తెరకు పరిచయమవడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో కథానాయకుడి పేరు శ్రీను. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఫ్యాన్‌. కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత శ్రీనుతో తొలిసారి మాట్లాడుతుంది. పవన్‌ ‘ఖుషి’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్లు కావాలని అడుగుతుంది. ఆ టికెట్లు సంపాదించడానికి శ్రీను ఎలాంటి ప్రయత్నాలు, సాహసాలు చేశాడనేది చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ కథ మొత్తం రెండు రోజుల్లో జరుగుతుంది. కథలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. తప్పకుండా ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’.

* ‘‘ఖుషి’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్ల కోసం అప్పట్లో ఎంతలా కష్టపడ్డారన్నది మాకంత తెలియదు కానీ, అనుదీప్‌కు బాగా తెలుసు. ఆనాటి తన అనుభవాలను మాకు చెప్పారు. ఆ చిత్ర టికెట్ల కోసం  ఎన్ని పాట్లు పడ్డారన్నది వింటుంటే కాస్త సీరియస్‌గా, చాలా ఫన్నీగా అనిపించేది. ఈ చిత్రం కోసం ఎన్నో అంశాలు  రీక్రియేట్‌ చేశాం. టీజర్‌లో చూస్తే అప్పటి రీల్‌ బాక్స్‌లు కనిపిస్తాయి. నిజంగా అప్పట్లో ఆ బాక్సులు తీసుకొచ్చే వాళ్లని హీరోలా చూసేవారు. ఈ చిత్రం చక్కటి వినోదంతో ‘జాతిరత్నాలు’ ఫ్లేవర్‌లో సాగుతుంది’’.


* ‘‘ఈ సినిమా హీరో శ్రీకాంత్‌ గతంలో ‘పిట్టగోడ’ చిత్రంలో నటించాడు. తెలంగాణ యాస, సింపుల్‌ హ్యూమర్‌, అమాయకత్వంతో కథకు సరిగ్గా నప్పాడు. హీరోయిన్‌ సంచితాది బిహార్‌. ఈ చిత్రం ద్వారా తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌ వంటి అనుభవజ్జులైన నటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మర్చిపోలేని అనుభవమిది.  రధన్‌ మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతమందించారు’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని