మాల్దీవుల్లో తొలిసారి.. గుర్రంపై స్వారీ‌!

సినీ నటులు తమ రోజూవారి అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. చిన్నాపెద్ద అనేతేడా లేకుండా అందరూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు అప్డేట్స్‌ ఇస్తుంటారు. కొత్త డ్రెస్‌ వేసుకన్నా.. విహారయాత్రకు వెళ్లినా.. స్నేహితులను కలుసుకున్నా..

Updated : 19 Nov 2020 09:35 IST

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటులు తమ రోజూవారి అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు అప్డేట్స్‌ ఇస్తుంటారు. కొత్త డ్రెస్‌ వేసుకున్నా.. విహార యాత్రకు వెళ్లినా.. స్నేహితులను కలుసుకున్నా.. ఇలా అన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. మరి ఈరోజు ఎవరెవరు ఏం పోస్టు చేశారో ఓ లుక్కేద్దామా?

* మాల్దీవుల్లో తన మొదటి సీ బాబ్ అనుభవాన్ని హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ అభిమానులతో పంచుకున్నారు.
* ఈ మెసేజ్‌ కొంచెం మొరటుగా ఉంది. దీనికి LOL (బిగ్గరగా నవ్వడం) అని రిప్లై ఇస్తానని ‘ఇస్మార్ట్‌శంకర్‌’ హీరోయిన్‌ నభానటేశ్‌ ఓ పోస్టు చేశారు.
* గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ ఫొటోను బాలీవుడ్‌ హీరో, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ అభిమానులతో పంచుకున్నారు.
* ‘మన జీవితంలో ఎన్నో హెచ్చుతగ్గులు, సమస్యలు, అడ్డంకులు వస్తుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే నవ్వడమే మనముందున్న మంచి మార్గం. వాటి నుంచి బయటపడేందుకు నవ్వుతూనే ఉండండి. మీ జీవితాన్ని పూర్తిస్థాయిలో గడపండి. అందుకు మీరు అర్హులు’ అని ఖుష్బూ ట్విటర్‌లో తన ఫొటోలు పోస్టు చేశారు.
* తమిళ స్టార్‌ హీరో శరత్‌కుమార్‌ సైతం జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.
* రోజా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

* ‘ప్రేమతో మీ కార్తిక్‌’ హీరోయిన్‌ సిమ్రత్‌ ‌కౌర్‌ ఒక ఫొటోను షేర్‌ చేసింది.
* తన గారాలపట్టి ఆరాథ్య తొమ్మిదో పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కూతురికి శుభాకాంక్షలు చెప్పారు.

* రేపటి రోజు కొత్తగా ఉండాలంటే నిన్నటి కంటే ఎక్కువ కష్టపడాల్సిందేనని హీరో నాగశౌర్య జిమ్‌లో కసరత్తు చేసిన ఫొటోను పంచుకున్నారు.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని