Hidimbha: అశ్విన్‌బాబు కొత్త అవతారం.. ఉత్కంఠగా ‘హిడింబ’ గ్లింప్స్‌

‘జీనియస్‌’, ‘రాజుగారి గది 2’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో మెప్పించిన నటుడు అశ్విన్‌బాబు. వాటన్నింటికీ భిన్నంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘హిడింబ’.

Updated : 29 Jun 2023 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జీనియస్‌’, ‘రాజుగారి గది 2’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాలతో మెప్పించిన నటుడు అశ్విన్‌బాబు. వాటన్నింటికీ భిన్నంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి దర్శకుడు. నందితా శ్వేత కథానాయిక. ఆదివారం ఈ సినిమా గ్లింప్స్‌ విడుదలైంది. ‘పోలీసు ఆపరేషనా’ అంటూ సీనియర్‌ నటుడు శుభలేఖ సుధాకర్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే డైలాగ్‌తో ప్రారంభమైన వీడియో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా ఓ బాలుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. శ్రీ విఘ్నేశ్‌ కార్తీక్‌ సినిమాస్‌ పతాకంపై గంగాపట్నం శ్రీధర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: వికాస్‌, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌, కూర్పు: ఎం.ఆర్‌. వర్మ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని