Induavadana: ఆకట్టుకుంటోన్న ‘ఇందువదన’ లుక్‌

కొన్నాళ్ల విరామం అనంతరం కొత్త చిత్రాన్ని ప్రకటించారు వరుణ్‌ సందేశ్‌. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో ‘ఇందువదన’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Updated : 03 May 2021 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నాళ్ల విరామం అనంతరం కొత్త చిత్రాన్ని ప్రకటించారు వరుణ్‌ సందేశ్‌. ఎమ్‌ఎస్‌ఆర్‌ దర్శకత్వంలో ‘ఇందువదన’ అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల తెలియజేశారు. ఫర్నాజ్‌ శెట్టి నాయిక. తాజాగా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. వరుణ్‌ లుక్‌ చాలా కొత్తగా ఉంది. పొడవాటి జుట్టుతో.. ఇప్పటి వరకు కనిపించని గెటప్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటున్నారు. కొత్త భామ ఫర్నాజ్‌ తన అందంతో ఆకర్షిస్తోంది. నాయకానాయికలు ఏకాంతంగా గడిపే దృశ్యమిది. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంటూ ‘ఇది భావోద్వేగాన్ని తెలియజేస్తుంది’ అనే వ్యాఖ్యను జోడించింది నిర్మాణ సంస్థ. దీన్ని బట్టి చూస్తుంటే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథ అనిపిస్తుంది. శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని