Vijay BEAST: అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌

తమిళ స్టార్‌ హీరో తళపతి విజయ్‌ జన్మదినం సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. విజయ్‌ తన 65వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ‘బీస్ట్’(మృగం) పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. విజయ్‌ పుట్టినరోజు కానుకగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అందులో విజయ్‌ స్నైపర్‌ గన్‌ను పట్టుకొని మాస్‌లుక్‌లో కనిపించారు.

Updated : 21 Jun 2021 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ జన్మదినం సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. విజయ్‌ తన 65వ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ‘బీస్ట్’(మృగం) పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. విజయ్‌ పుట్టినరోజు కానుకగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అందులో విజయ్‌ స్నైపర్‌ గన్‌ను పట్టుకొని మాస్‌లుక్‌లో కనిపించారు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమా పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. విజయ్‌తో పాటు డస్కీ సిరెన్‌, పూజా హెగ్డే సందడి చేయనున్నారు. తెలుగులో కూడా బీస్ట్‌ పేరుతోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు