‘కిరాతక’ నుంచి రొమాంటిక్‌ ఫస్ట్‌లుక్‌

ఆదిసాయికుమార్‌, పాయల్‌రాజ్‌పూత్‌ జంటగా ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ రాబోతోంది. వీరభద్రం దర్శకత్వంలో ‘కిరాతక’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ఆగస్టు 13 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. గురువారం చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఫస్ట్‌లుక్‌లో హీరో, హీరోయిన్లు రొమాంటిక్‌ పోజులో కనిపిస్తున్నారు.

Published : 08 Jul 2021 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదిసాయికుమార్‌, పాయల్‌రాజ్‌పూత్‌ జంటగా ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ రాబోతోంది. వీరభద్రం దర్శకత్వంలో ‘కిరాతక’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కనుంది. ఆగస్టు 13 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. గురువారం చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఫస్ట్‌లుక్‌లో హీరో, హీరోయిన్లు రొమాంటిక్‌ పోజులో కనిపిస్తున్నారు. దీంతో పాటు మరో లుక్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. అందులో హీరో ఆది సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో షమ్నా కాసిమ్‌(పూర్ణ), దేవ్‌గిల్‌ కీలకపాత్రల్లో నటించనున్నారు. విజన్‌ సినిమాస్‌ పతాకంపై మాస్టర్‌ నాగం జెశ్విన్‌రెడ్డి సమర్పణలో నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు