Maestro: బేబీ ఓ బేబీ వచ్చేసింది..!

‘బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే’ అంటూ పాటలు పాడుతున్నారు నటుడు నితిన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మాస్ట్రో’....

Published : 16 Jul 2021 14:21 IST

‘మాస్ట్రో’ ఫస్ట్‌ లిరికల్‌ వీడియో ఆగయా

హైదరాబాద్‌: ‘బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే’ అంటూ పాటలు పాడుతున్నారు నటుడు నితిన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అందాధున్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ‘మాస్ట్రో’ నుంచి మొదటి లిరికల్‌ వీడియోని చిత్రబృందం నెట్టింట్లో షేర్‌ చేసింది. ‘అంతులేని కళ్లలోకిలా.. అందమొచ్చి దూకితే ఎలా’ అంటూ సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

‘మాస్ట్రో’ రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్‌ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. నితిన్‌ ప్రియురాలిగా నటి నభానటేశ్‌ సందడి చేయనున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి సాగర్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని