Vijay: తొలి షెడ్యూల్‌ పూర్తి

‘బీస్ట్‌’ తర్వాత తమిళ కథానాయకుడు విజయ్‌, తెలుగు దర్శకుడు  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దళపతి-66’గా పిలుచుకొనే ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్‌ పూర్తైంది.

Updated : 16 Apr 2022 08:49 IST

‘బీస్ట్‌’ తర్వాత తమిళ కథానాయకుడు విజయ్‌, తెలుగు దర్శకుడు  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దళపతి-66’గా పిలుచుకొనే ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్‌ పూర్తైంది. ఈ మేరకు దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ‘‘తొలి షెడ్యూల్‌ చాలా చిన్నది. వారం రోజుల్లోనే ముగిసింది. అభిమానుల కోసం ముందే   చెప్పినట్లు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విజయ్‌ ఫస్ట్‌ లుక్‌ ఇస్తాం’’ అన్నారు. ఈ వారం రోజుల్లో ఓ పాటకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది కుటుంబ కథతో రూపొందుతోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక. శరత్‌కుమార్‌ తొలిసారిగా విజయ్‌తో కలసి ఇందులో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని