REPUBLIC: ప్రాణంలోని ప్రాణం.. దేహంలోని దేహం

సాయితేజ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ దేవకట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. వైవిధ్యమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ ఐఏఎస్‌ అధికారిగా సాయితేజ్‌, అతనికి జోడీగా ఐశ్వర్యరాజేశ్‌ కనిపించనుంది.

Published : 10 Jul 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయితేజ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ దేవకట్టా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. వైవిధ్యమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ ఐఏఎస్‌ అధికారిగా సాయితేజ్‌, అతనికి జోడీగా ఐశ్వర్యరాజేశ్‌ కనిపించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిత్రబృందం నుంచి మొదటి గీతాన్ని ‘గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ పేరుతో అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ‘నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. రహమాన్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, ధనుంజయ్‌, హైమత్‌ మహమ్మద్‌, ఆదిత్య అయ్యంగర్‌, పృధ్వీ చంద్ర ఆలపించారు. మణిశర్మ సంగీతం. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని