Ante Sundaraniki: సుందరం సారోరు వచ్చారు

నాని కథా  నాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే... సుందరానికి!’. నజ్రియా ఫహాద్‌ కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. జూన్‌ 10న   ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని పంచెకట్టు.

Updated : 07 Apr 2022 12:12 IST

నాని కథా  నాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే... సుందరానికి!’. నజ్రియా ఫహాద్‌ కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలు. జూన్‌ 10న   ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని పంచెకట్టు... పాటని బుధవారం విడుదల చేశారు. వివేక్‌ సాగర్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని  దర్శకుడు హసిత్‌ గోలి రచించగా, ప్రముఖ గాయని అరుణా సాయిరామ్‌ ఆలపించారు. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ సహా అమెరికాలోని ప్రాచుర్యం పొందిన ప్రదేశాల నేపథ్యంలో సాగే పాట ఇది. ‘సారోరు ఫేడ్‌ అయిపోయె... ఫ్రీడమ్‌ మీదింకా’ అంటూ సాగే ఈ పాటతో నాని పోషించిన సుందరం పాత్రని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు   నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని