KGF2: కే జీ యఫ్‌ 2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..!

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుని ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం ‘కే జీ యఫ్‌’. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా...

Updated : 21 Mar 2022 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొని ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన చిత్రం ‘కే జీ యఫ్‌’. యశ్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘కే జీ యఫ్‌-2’ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదల కోసం ‘కే జీ యఫ్‌’ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం షురూ చేసింది. ఇందులో భాగంగా మొదటి పాటను విడుదల చేసింది. ‘తుపాన్‌’ అంటూ సాగే ఈ పాట హీరో పాత్రను వర్ణించేలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. రవి అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్, రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీనిధి శెట్టి, రావు రమేశ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts