Ramarao On Duty: తూలే గిరగిరమని బుర్రే ఇట్టా..

రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. సామ్‌ సీఎస్‌ స్వరాలందిస్తున్నారు.

Updated : 11 Apr 2022 09:31 IST

వితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. సామ్‌ సీఎస్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్రం నుంచి  ‘‘బుల్‌ బుల్‌ తరంగ్‌’’ పాట విడుదల చేశారు. రవితేజ, రజిషాలపై చిత్రీకరించిన ప్రేమ గీతమిది. ‘‘తూలే గిరగిరమని బుర్రే ఇట్టా.. తేలిందే నెలవంతా అడుగుల వెంటా’’ అంటూ సాగుతున్న ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా.. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. పాటలో రవితేజ, రజిషా జంటగా కనిపించిన తీరు, ఆయన వేసిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. రవితేజ ప్రభుత్వాధికారిగా కనిపిస్తారు. వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి కూర్పు: ప్రవీణ్‌ కెఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు