Ramarao On Duty: రామారావు ఆన్‌ డ్యూయెట్‌

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది

Updated : 08 Apr 2022 14:04 IST

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 17న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 10న ఈ సినిమా నుంచి తొలి పాట ‘‘బుల్‌ బుల్‌ తరంగ్‌’’ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్న పోస్టర్‌లో రవితేజ, రజిషా రొమాంటిక్‌ లుక్‌లో స్టైలిష్‌గా స్టెప్పేస్తూ కనిపించారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారిగా ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సిఎస్‌, కూర్పు: ప్రవీణ్‌ కెఎల్‌, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని