RamaRao On Duty: రామారావు..రాగాలాపన

రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ     దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు

Updated : 04 May 2022 13:51 IST

రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ     దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి ఈనెల 7న ‘‘సొట్ట బుగ్గల్లో..’’ అనే గీతాన్ని    విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త లుక్‌ పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో రవితేజ ఒక మసీదు ముందు నుంచి స్టైలిష్‌గా నడిచొస్తూ కనిపించారు. ఇందులో ఆయన శక్తిమంతమైన ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. సంగీతం: సామ్‌ సిఎస్, కూర్పు: ప్రవీణ్‌ కెఎల్, ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని