Sridevi Shoban Babu: శ్రీదేవిని చూశాక శోభన్‌బాబు

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 07 Dec 2022 19:00 IST

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నిను చూశాక...’ పాటని ప్రముఖ కథానాయకుడు సాయి తేజ్‌ విడుదల చేశారు. కమ్రాన్‌ స్వరకల్పనలోని ఈ గీతాన్ని రాకేందుమౌళి రచించగా, జునైద్‌కుమార్‌ ఆలపించారు. ‘‘రెండు వేర్వేరు మనస్తత్వాలున్న ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నాయకానాయికలపై తెరకెక్కించిన నిను చూశాక... పాట మనసుల్ని హత్తుకునేలా ఉంటుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ రామస్వామి ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని