కొవిడ్‌: మొదటి 2 రోజులు ఇబ్బందిపడ్డాం: ఉపాసన

తాను కరోనా బారినపడ్డానని ప్రకటించి ఒకానొక సమయంలో అందర్నీ ఒకింత షాక్‌కు గురిచేశారు నటుడు రామ్‌ చరణ్‌. ఇంట్లోనే స్వీయనిర్బంధంలోకి వెళ్లిన చెర్రీ తగిన జాగ్రత్తలు పాటించి ఇటీవల కోలుకున్నారు. కాగా, చరణ్‌తో కలిసి క్వారంటైన్‌లో...

Updated : 08 Dec 2022 18:47 IST

హైదరాబాద్‌: తాను కరోనా బారినపడ్డానని ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేశారు నటుడు రామ్‌ చరణ్‌. ఇంట్లో స్వీయనిర్బంధంలో ఉన్న చరణ్‌.. తగిన జాగ్రత్తలు పాటించి ఇటీవల కోలుకున్నారు కూడా. కాగా.. చరణ్‌తో కలిసి క్వారంటైన్‌లో ఉన్న రోజులను ఉపాసన తాజాగా గుర్తుచేసుకున్నారు. కరోనా నుంచి కోలుకునే సమయంలో మొదటి రెండు రోజులు ఇబ్బందిపడ్డామని తెలిపారు.

‘చరణ్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తెలియగానే.. మా సిబ్బంది గురించే ఎక్కువగా కంగారుపడ్డాం. ఎందుకంటే వాళ్లందరూ తమ కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వెంటనే వాళ్లందరికీ సమాచారం అందించాం. నాకు నెగెటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ పాజిటివ్‌గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో నేను కూడా చరణ్‌తో కలిసి క్వారంటైన్‌లోనే ఉన్నాను. మేమిద్దరం ఇంట్లో అన్నిరకాల జాగ్రత్తలు పాటించి.. కోలుకున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు మాకు సూచించినప్పటికీ.. మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బందిపడ్డాం. గందరగోళానికి గురయ్యాం. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొవాలని మాకు అర్థమైంది. ఈ ప్రయాణంలో మా బంధం.. మా స్టాఫ్‌తో మాకున్న అనుబంధం ఇప్పుడు మరింత బలపడింది’ అని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చదవండి

స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరో, హీరోయిన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు