Allu arjun: ‘పుష్ప రాజ్‌’ గ్యారేజ్‌ను చూశారా.. బన్ని అడ్డాలో ఖరీదైనవి ఇవే!

పుష్ప హీరో అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌... తన లైఫ్‌స్టైల్‌ కూడా తగ్గేదే లే అన్నట్టుగా విలాసవంతంగా ఉంటుంది...

Published : 26 Feb 2022 10:57 IST

అల్లు వారి విలాసాలు చూద్దాం రారండి!

పుష్ప హీరో అల్లు అర్జున్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌... తన లైఫ్‌స్టైల్‌ కూడా తగ్గేదే లే అన్నట్టుగా విలాసవంతంగా ఉంటుంది... తన వ్యానిటీ వ్యాన్‌.. మోజు పడి కట్టించుకున్న బంగ్లా.. ప్రయాణించడానికి వాడే కార్లు.. వీటికి సంబంధించి అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్న సంగతులివి...

సకల సౌకర్యాల వ్యానిటీ వ్యాన్‌

అల్లు అర్జున్‌కి నలుపు రంగు అంటే చాలా ఇష్టం అనే విషయం చాలామందికి తెలిసిందే. అదే ఇష్టంతో షూటింగ్‌ ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి సకల సౌకర్యాలతో వ్యానిటీ వ్యాన్‌ తయారు చేయించుకున్నాడు. దాని మీద స్టైలిష్‌గా ఏఏ అక్షరాలు రాయించుకున్నాడు. భూతల స్వర్గంలాంటి ఈ వాహనానికి బన్నీ ‘ఫాల్కన్‌’ అనే పేరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఇంటీరియర్‌ ఫొటోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పంచుకున్నాడు బన్నీ. పెద్ద తెరతో కూడిన టీవీ సెట్‌, రిఫ్రిజిరేటర్‌, విలాసవంతమైన సోఫా.. ఇలాంటి వసతులెన్నో ఉన్నాయి అందులో. ఖరీదు: రూ.7 కోట్లు


అచ్చెరువొందే భవంతి

అన్ని వస్తువులకు నలుపు రంగు ఉండేలా చూసుకునే బన్నీ.. ఇంటిని మాత్రం పాల నురగ లాంటి తెల్లని రంగుతో తీర్చిదిద్దుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటుందీ సౌధం. దీనికి ముద్దుగా ‘బ్లెస్సింగ్‌’ అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, హోంథియేటర్‌, ఆటస్థలం.. ఇలా సకల సౌకర్యాలు కొలువుదీరి ఉన్నాయి. రాత్రివేళల్లో నీలం రంగు పరుచుకొని ఆకాశాన్ని తలపించడం దీని ప్రత్యేకత. ఖరీదు: రూ.100 కోట్లు


కొలువైన వాహనాలు..

అల్లు గ్యారేజీలో కనీసం అరడజను వరకు లగ్జరీ వాహనాలు కొలువుదీరి ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగా ఒక్కో సమయంలో ఒక్కోదాన్ని ఉపయోగిస్తుంటాడు.

రేంజ్‌ రోవర్‌ వోగ్‌, ఖరీదు: రూ.2.26 కోట్లు

ఓ రేంజ్‌లో ఉండే ఈ రేంజ్‌ రోవర్‌ని సొంతం చేసుకున్నప్పుడు ట్విటర్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు బన్నీ. ఈ కొత్త కారుకి ముద్దుగా ‘బీస్ట్‌’ అనే పేరు పెట్టుకున్నట్టు చెప్పాడు.

హమ్మర్‌ హెచ్‌2, ఖరీదు: రూ75లక్షలు

అల్లు అర్జున్‌ లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తున్నప్పుడు, సొంతంగా డ్రైవింగ్‌ చేయాలనుకున్నప్పుడు ఈ వాహనాన్ని ఉపయోగిస్తుంటాడు. ఎంతో మనసు పడి కొనుక్కున్న ఈ స్పోర్ట్‌ యుటిలిటీ వాహనం.. ధోనీ, హర్భజన్‌సింగ్‌లాంటి క్రికెటర్ల దగ్గర కూడా ఉంది.

మెర్సిడెస్‌ 200 సీడీఐ, ఖరీదు: రూ.35 లక్షలు

కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమానికి వెళ్లడానికి అల్లు అర్జున్‌ ఎంచుకునే కారు ఇదే. సన్‌రూఫ్‌ టాప్‌ సౌకర్యం ఉన్న ఈ కారులో పిల్లలు అర్హ, అయాన్‌లతో కలిసి చాలాసార్లు వీధుల్లో షికారుకెళ్లాడు అల్లు అర్జున్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు