Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..
నటి ఆశా సైనీ (Asha Saini).. షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాను ఓ నిర్మాతతో రిలేషన్‌లో ఉన్నానని.. అతడు చిత్రహింసలకు గురి చేశాడని పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసింది.
ముంబయి: ‘ప్రేమకోసం’తో నటిగా తెరంగేట్రం చేసి ‘నరసింహ నాయుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ప్రేమతో రా’ వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైన నటి ఫ్లోరా సైనీ (Flora Saini). ఆశా సైనీ (Asha Saini)గా తెలుగువారికి ఆమె సుపరిచితం. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు తెలిపింది. అయితే, ఈ విషయాన్ని చెప్పడానికంటే ముందు ఓ నిర్మాతపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని.. అతడు తనని చిత్రహింసలకు గురి చేశాడని పేర్కొంది.
‘‘20 ఏళ్ల వయసులో కెరీర్ పరంగా నేను ఉత్తమ స్థానంలో ఉన్నాను. అప్పటికే పది చిత్రాల్లో నటించాను. ఎంతోమంది డిజైనర్ల బ్రాండ్స్ కోసం మోడల్‌గా పనిచేశాను. అదే సమయంలో ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డాను. కొద్ది రోజులకే పరిస్థితులు మారిపోయాయి. అతడు నన్ను వేధింపులకు గురి చేశాడు. నా ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టడం మొదలుపెట్టాడు. నా ఫోన్ లాక్కొన్నాడు. నటించవద్దని బలవంతం చేశాడు. 14 నెలలపాటు ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. ఓరోజు సాయంత్రం నన్ను పొట్టపై తన్నాడు. ఆ బాధ భరించలేక అక్కడి నుంచి పారిపోయాను. అమ్మానాన్నలను కలిసి.. వాళ్లతో ఉన్నాను.
ఆ నిర్మాత వల్ల నేను పొందిన శారీరక, మానసిక బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి సినీ పరిశ్రమలోకి వచ్చాను. పరిస్థితులు చక్కబడటానికి సమయం పట్టినప్పటికీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ నేను ప్రేమను కనుగొన్నాను. ఎంతటి చీకటిలోనైనా నేను వెలుతురిని వెతుక్కుంటాను’’ అని ఆశా పేర్కొన్నారు. కొత్త బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని.. అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్
-
PCB Chief: పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర విమర్శలు!
-
Hacking: అమెరికా కీలక ఈ మెయిల్స్‌ను తస్కరించిన చైనా హ్యాకర్లు !
-
Chandrababu Arrest: సెప్టెంబర్ 30న ‘మోత మోగిద్దాం!’.. వినూత్న నిరసనకు తెదేపా పిలుపు