Ramnath Kovind: ‘మేజర్’కు మాజీ రాష్ట్రపతి ప్రశంసలు
గతేడాది విడుదలైన మేజర్ సినిమా ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటోంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై తాజాగా భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు.
గతేడాది విడుదలైన మేజర్ సినిమా ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటోంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై తాజాగా భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అడివి శేష్‌తో పాటు.. చిత్ర బృందాన్ని తన ఇంటికి మంగళవారం ఆహ్వానించారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు శేష్. గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌జీని కలవడం విశేషం. మేజర్ సినిమాపై ఆయన స్పందించిన తీరుతో పొంగిపోయాను. ఆయనతో మంచి సంభాషణ జరిగింది. త్వరలో మేజర్ మొదటి వార్షికోత్సవం జరగనుంది. ఇప్పటికీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తునే ఉన్నారు. ఎప్పటికీ కృతజ్ఞతలు అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు అడివి శేష్. 26/11 ఉగ్రదాడుల్లో పోరాడి ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమాలో సందీప్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు