ARI: ‘అరి’ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ వెంకయ్యనాయుడు ట్వీట్‌

‘అరి’ (Ari) సినిమా ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.

Published : 30 Mar 2023 17:11 IST

హైదరాబాద్‌: వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ‘అరి’ (ARI). ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్‌ బాయ్‌’ ఫేం జయశంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాయికుమార్‌ (Saikumar), అనసూయ భరద్వాజ్‌ (Anasuya), శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ మంచి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా ఈ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.

‘అరి’ (ARI) చిత్రబృందంతో దిగిన ఫొటోలను పంచుకున్న ఆయన ‘‘అరి’ ట్రైలర్‌ చూడడం చాల ఆనందంగా ఉంది. ఆరు రకాల అంతః శత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.  దర్శకుడు జయశంకర్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో సహా చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేశారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌తో ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు