హర్భజన్‌ సింగ్‌ ‘ఫ్రెండ్‌షిప్‌’ గీతం విన్నారా!

క్రీడాకారుడిగా (క్రికెట్‌) మైదానంలో సత్తా చాటిన హర్భజన్‌ సింగ్‌ నటుడిగానూ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

Published : 29 Mar 2021 20:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ క్రీడాకారుడిగా మైదానంలో సత్తా చాటిన హర్భజన్‌ సింగ్‌ నటుడిగానూ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేయబోతున్నారాయన. ఇటీవలే ఈ చిత్రంలోని ‘లైఫ్‌లో మజా కోసం’ అనే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. కాలేజీ స్నేహానికి సంబంధించిన ఈ గీతం యువతని బాగా మెప్పిస్తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల్ని అమితంగా ఆకట్టుకునేలా ఉంది. ఎస్‌.పి. అభిషేక్ సాహిత్యం అందించిన ఈ పాటకు డీఎం. ఉదయకుమార్‌ స్వరాలు సమకూర్చారు. శరత్‌ సంతోష్‌ ఆలపించారు. 

జాన్‌పాల్‌ రాజ్‌, శ్యాం సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాస్లియా కథానాయిక. జేపీఆర్‌, స్టాలిన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని