Khiladi: ‘ఫుల్‌ కిక్కు’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

సంగీత ప్రియుల్ని అలరించిన ‘ఫుల్‌ కిక్కు’ గీతం ఫుల్‌ వీడియో విడుదలైంది. ‘ఖిలాడి’ సినిమాలోని గీతమిది.

Published : 02 Mar 2022 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించిన ‘ఫుల్‌ కిక్కు’ గీతం ఫుల్‌ వీడియో విడుదలైంది. ‘ఖిలాడి’ సినిమాలోని పాట ఇది. రవితేజ, డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి నాయకానాయికలుగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. రవితేజ, డింపుల్‌ డ్యాన్స్‌, కలర్‌ఫుల్‌ సెట్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని సాగర్‌, మమతా శర్మ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ పవర్‌ఫుల్‌ చిత్రానికి రమేష్‌ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని