క్లాస్‌ కల్యాణి.. మాస్‌ బిర్యాని.. సాంగ్‌ చూశారా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’ మంచి విజయం సాధించింది. థియేటర్లలో అందర్నీ అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ వేదికగా......

Published : 03 Feb 2021 03:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’ మంచి విజయం సాధించింది. థియేటర్లలో అందర్నీ అలరించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్‌ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ‘భూమ్‌ బద్దల్‌’ ఐటమ్‌ సాంగ్‌ సైతం యువతను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమాలోని ‘మాస్‌ బిర్యాని’ పాటను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. అందులో రవితేజ, శ్రుతిహాసన్‌ కలిసి చిందులేశారు. ఇద్దరూ తమదైన స్టైల్‌లో మాస్‌ స్టెప్పులు వేసిన ఈ పాట అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటకు తమన్‌ సంగీతం అందించారు. రాహుల్‌ నంబియార్‌, సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి మరి..
ఇదీ చదవండి..

ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ సెట్‌లో అగ్నిప్రమాదం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని