Published : 23 May 2022 17:19 IST

Adipurush: ‘నీ బాంచన్‌ ఐతా’.. ‘ఆదిపురుష్‌’ అప్‌డేట్‌ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ ఫన్నీ మీమ్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ అభిమాన నటుడి సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్‌. సినిమా కోసమే కాదు దానికి సంబంధించిన పాటలు, ప్రచార చిత్రాలు.. ఇలా ఏది ఆలస్యమైనా తట్టుకోలేరు. అందుకే అప్‌డేట్‌ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందాన్ని కోరుతుంటారు. ఒక్కోసారి ఒత్తిడీ తీసుకొస్తుంటారు. ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఏదైనా అప్‌డేట్‌ కావాలంటూ ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ట్విటర్‌ వేదికగా ఆ సినిమా దర్శకనిర్మాతలను ట్యాగ్‌ చేస్తూ ఫన్నీ మీమ్స్‌ పోస్ట్‌ చేశారు. #WakeUpTeamAdipurush హ్యాష్‌ట్యాగ్‌ పేరిట.. కొందరు సినిమాల్లోని సంభాషణలనుగుణంగా మీమ్స్‌ రూపొందిస్తే మరికొందరు నేరుగా పోస్ట్‌లు పెట్టారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా ప్రభాస్‌ అభిమానులంతా ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. వీటిల్లోని.. ‘నీ బాంచన్‌ ఐతా ఆదిపురుష్‌ అప్‌డేట్‌ ఇవ్వన్నా’ అనే మీమ్‌ ఎక్కుమందిని ఆకర్షిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర చెప్పే సంభాషణ ఇది. దానికి కొంచెం మార్పు చేసి, ఇలా నవ్వులు పంచుతున్నారు. ఇలాంటి మరికొన్ని ఫన్నీ మీమ్స్‌ చూసే ముందు ఈ చిత్ర వివరాలు తెలుసుకుందాం.

రామాయణ ఇతిహాసం ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్వరుడిగా నటించారు. సోనాల్‌ చౌహాన్‌ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా చిత్రీకరణ గతేడాది నవంబరులో పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును ఈ ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా పలు కారణాల వల్ల వాయిదా పడింది. దాంతో 2023 సంక్రాంతి కానుకగా (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్‌తో త్రీడీ వెర్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఫస్ట్‌లుక్‌ కూడా రాకపోవడంతో అభిమానులు ఇలా ‘వి వాంట్‌ అప్‌డేట్‌’ అంటూ సందడి చేస్తున్నారు.
Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని