Mahesh Babu: మహేశ్‌ బాబు మిమిక్రీ చేస్తాడు.. అమితాబ్‌కు ఉన్నంత టాలెంట్‌ ఉంది: ఆదిశేషగిరి రావు

దివంగత నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు  (G Adiseshagiri Rao) మీడియాతో మాట్లాడారు. మహేశ్‌ బాబు (Mahesh Babu) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 26 May 2023 13:19 IST

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు ఉన్న టాలెంట్‌ గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. దివంగత నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు (G Adiseshagiri Rao) తాజాగా మహేశ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మే 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మీడియాతో మాట్లాడారు.

‘అందరికీ మహేశ్‌ (Mahesh Babu) గురించి తెలిసింది చాలా తక్కువ. తను ఏ ఆర్టిస్టునైనా ఇమిటేట్‌ చేస్తాడు. ఎవరి వాయిస్‌ అయినా మిమిక్రీ చేస్తాడు. ఇక నటనలోనూ ఎంతో టాలెంట్‌ ఉంది. ప్రతి భావోద్వేగాన్ని చక్కగా పండించగలడు. అమితాబ్‌ బచ్చన్‌కు ఉన్నంత ప్రతిభ ఉంది. ‘కొడుకు దిద్దిన కాపురం’ సమయంలోనే మహేశ్‌ పెద్ద స్టార్‌ అవుతాడని అనుకున్నాం. ఎంతో కష్టపడి డ్యాన్స్‌ నేర్చుకున్నాడు. మొదట్లో కంటే ఇప్పుడు డ్యాన్స్‌లోనూ అదరగొడుతున్నాడు. చిన్పప్పుడు బాగా అల్లరి చేసేవాడు’’ అని ఆదిశేషగిరి రావు చెప్పారు. ఇక పాన్‌ ఇండియా స్టార్స్‌ గురించి మాట్లాడిన ఆయన.. ప్రత్యేకంగా అటువంటి స్టార్స్‌ ఎవరూ ఉండరని అన్నారు. కథ బాగుంటే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని చెప్పారు. ఆ సినిమాలో నటించిన హీరోకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు