Adivi Sesh: ‘గూఢచారి’ ఫ్రాంఛైజీ కొనసాగుతుంది: అడవి శేష్‌

గూఢచారి ఫ్రాంఛైనీలో మరిన్ని చిత్రాలు వస్తాయని కథానాయకుడు అడవి శేష్‌ చెప్పారు.

Published : 10 Jan 2023 17:11 IST

హైదరాబాద్‌: ‘గూఢచారి’ మూవీ ఫ్రాంఛైజీ కొనసాగుతుందని, ఈ సిరీస్‌లో మరిన్ని సినిమాలు వస్తాయని నటుడు అడవిశేష్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘జీ2’. గతంలో వచ్చిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ ‘జీ2’ ప్రీ విజన్‌ లాంచ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అడవిశేష్‌ మాట్లాడారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ‘గూఢచారి’ ఫ్రాంఛైజీని తీసుకెళ్లాలని ఉంది. ఒక సినిమా హాలీవుడ్‌ వాళ్లను కూడా అలరించగలదని రాజమౌళి సర్‌ వల్ల చూస్తున్నాం. ఇండియన్‌ స్పై ఫ్రాంఛైజీగా తీసుకెళ్లాలని తపన. వినయ్‌ కొత్త దర్శకుడు. అతనికి చక్కని విజన్‌ ఉంది. మేము ‘గూఢచారి’, ‘మేజర్‌’ చేస్తున్నప్పుడు నాకు, శశికిరణ్‌కు డౌట్స్‌ ఉంటే, వినయ్‌ ఓకే చెప్పిన తర్వాత ఒప్పుకొనేవాళ్లం. నిర్మాతలు విశ్వప్రసాద్‌, అభిషేక్‌, అనిల్‌లకు థ్యాంక్స్‌. స్పై యాక్షన్‌ మూవీలకు మరో స్థాయిలో ‘జీ2’ ఉంటుందని గర్వంగా చెప్పగలను. దక్షిణాదిలో స్పై మూవీ ట్రెండ్‌ను ‘గూఢచారి’ మళ్లీ తీసుకొచ్చింది. జీ2 ఆలిండియా ఫ్రాంఛైజ్‌గా మారబోతోంది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాం. రాబోయే కొద్ది నెలల్లో సిక్స్‌ ప్యాక్‌చేసి షూటింగ్‌కు వెళ్తాం. 2024లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మాకు ఎవరితోనూ పోటీ లేదు. మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఈ సినిమా ఐదు దేశాల్లో షూటింగ్‌ చేయబోతున్నాం’’అని అడివి శేష్‌ చెప్పారు. సినిమా మీరు అనుకునేదాని కన్నా చాలా గొప్ప ఉంటుందని దర్శకుడు వినయ్‌ కుమార్‌ శిరిగినీడు అన్నారు. ‘గూఢచారి’ సిరీస్‌ కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో నిర్మాతలు విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, అనిల్‌ సుంకర, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల, రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని