‘గాలి సంపత్‌’ రెడీ అయ్యాడిలా!

నట కిరీటి రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన మిత్రుడు సాయికృష్ణ కథను అందించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీష్‌కృష్ణ దర్శకత్వం

Published : 24 Mar 2021 22:01 IST

హైదరాబాద్‌: నట కిరీటి రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్‌’. ప్రముఖ దర్శకుడు అనిల్‌రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన మిత్రుడు సాయికృష్ణ కథను అందించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘అలా ఎలా’ ఫేమ్‌ అనీష్‌కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మూగవ్యక్తిగా నటిస్తూ కేవలం ‘ఫీఫీ’అనే సౌండ్‌తోనే సంజ్ఞలు చేస్తుంటాడు. నటనంటే అమిత ఆసక్తి. దురదృష్టవశాత్తు ఇంటి వెనకున్న బావిలో పడిపోతే, తండ్రి కనిపించక కొడుకు గాబారా పడుతుంటాడు. తండ్రీకొడుకుల మధ్య అప్యాయతలను ఈ చిత్రం చూపిస్తుంది. కొడుకుగా శ్రీవిష్ణు, అనువాదకుడిగా కమెడియన్‌ సత్య తమదైన శైలి నటించి మెప్పించారు. లవ్‌లీసింగ్‌ కథానాయికగా అలరించింది. మరి ఆ గాలిసంపత్‌ ఎలా బావిలో పడ్డాడు, ఆ అందమైన అరకులో ఎలా షూట్‌ చేశారో చూడాలనుందా? అయితే ఈ మేకింగ్‌ వీడియో చూసేయండి. ప్ర్తస్తుతం ఈ చిత్రం ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికల్లో ప్రదర్శితమౌతోంది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు