Gaalodu: కథలో బలం లేకపోతే ఎంత ఖర్చు చేసినా వృథాయే!

‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ‘గాలోడు’. అందుకే ఈ చిత్ర విజయాన్ని ముందే ఊహించా’’ అన్నారు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన చిత్రమే ‘గాలోడు’.

Updated : 23 Nov 2022 07:11 IST

‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ‘గాలోడు’. అందుకే ఈ చిత్ర విజయాన్ని ముందే ఊహించా’’ అన్నారు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల (Rajasekar). ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్‌ (Sudheer) హీరోగా నటించిన చిత్రమే ‘గాలోడు’ (Gaalodu). ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు రాజశేఖర్‌ రెడ్డి.

* ‘‘సుధీర్‌తో నేను మొదట ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ అనే చిత్రం చేశా. అది వాణిజ్యపరంగా చక్కటి విజయాన్ని అందుకుంది. అప్పుడే తనకు జనాల్లో మంచి క్రేజ్‌ ఉందని అర్థమైంది. నిజానికి ఆ సినిమాకి తొలుత మరో హీరోను అనుకున్నాం. డేట్స్‌ కుదర్లేదు. దీంతో మంచి కామెడీ టచ్‌ ఉన్న హీరో కోసం వెతుకుతున్నప్పుడు సుధీర్‌ మా కథలోకి వచ్చాడు. అలా ఆయనతో నా ప్రయాణం ప్రారంభమైంది. నిజానికి మేము మా కాంబినేషన్‌లో ముందుగా అనుకున్న చిత్రం ‘గాలోడు’నే. ఈ రెండు కథల్లోనూ నాయికగా రష్మీనే (Rashmi) అనుకున్నాం. కానీ, డేట్స్‌ సర్దుబాటు కాలేదు. త్వరలో సుధీర్‌, రష్మీతో ‘గజ్జెల గుర్రం’ అనే సినిమా చేయాలనుకుంటున్నా’’.

* ‘‘నాకు కమర్షియల్‌ డైరెక్టర్‌గానే పేరు తెచ్చుకోవాలని ఉంది. కథలో బలం లేనప్పుడు ఎంత బడ్జెట్‌ పెట్టినా వృథానే అవుతుంది. కథలో కొత్తదనమున్నా.. ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెట్టాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాల్సిందే. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు పెద్ద కథలున్నాయి. ముందుగా సుధీర్‌ - రష్మీల కాంబినేషన్‌లోనే సినిమా చేయాలనుకుంటున్నా. అది ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ చేయలేను’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని