Junior: ఇతడే ‘జూనియర్‌’

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా తెరకు పరిచయం అవుతున్నారు. శ్రీలీల కథానాయిక. జెనీలియా ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది.

Updated : 01 Oct 2022 13:59 IST

ర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి (Kireeti reddy) కథానాయకుడిగా తెరకు పరిచయం అవుతున్నారు. శ్రీలీల కథానాయిక. జెనీలియా ఓ కీలక పాత్రలో సందడి చేయనుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి ‘జూనియర్‌’ (Junior) అనే పేరుని ఖరారు చేశారు. కిరీటి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పేరుతోపాటు, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘చిన్నప్పట్నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది...’ అంటూ సాగే సంభాషణ ఆ ప్రచార చిత్రంలో వినిపిస్తుంది. ‘‘ప్రేమ, కుటుంబ వినోదంతో రూపొందుతున్న చిత్రమిది. కథకి తగ్గట్టుగా పేరుని ఖరారు చేశాం. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌లతో కూడిన సాంకేతిక బృందం ఈ సినిమాకి ప్రధాన బలం’’ అన్నాయి సినీ వర్గాలు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts