Game Changer: అందుకే షూటింగ్‌ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్‌

రామ్‌ చరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడడానికి కారణమేంటో చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

Published : 24 Sep 2023 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రాల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ఒకటి. రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్‌ (S Shankar) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణపై సోషల్‌ మీడియాలో ఇటీవల రూమర్స్ వచ్చాయి. కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌కు అంతా సిద్ధమైన తర్వాత చివరి నిమిషంలో శంకర్‌ దాన్ని క్యాన్సిల్‌ చేశారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) పనుల నిమిత్తం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. ‘‘కొందరు ఆర్టిస్ట్‌లు అందుబాటులో లేకపోవడం వల్లే ‘గేమ్‌ ఛేంజర్‌’ సెప్టెంబరు షెడ్యూల్‌ షూటింగ్‌ వాయిదా పడింది. అక్టోబరు రెండో వారంలో చిత్రీకరణ పునః ప్రారంభమవుతుంది’’ అని తెలిపింది.

మహేశ్‌ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్‌

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా విడుదల తేదీ కోసం చరణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చిత్ర బృందం ఆ అప్‌డేట్‌ ఇవ్వలేదు. మరోవైపు, కొన్ని రోజుల క్రితం ఓ పాట లీక్‌కాగా నిర్మాత దిల్‌ రాజు సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. పాటను లీక్‌ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

అలాగే, కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా తెరకెక్కుతున్న చిత్రమే ‘ఇండియన్‌ 2’ (Indian 2). శంకర్‌- కమల్‌ హాసన్‌ కాంబోలో కొన్నేళ్ల కిత్రం వచ్చిన హిట్‌ చిత్రం ‘ఇండియన్‌’కు సీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని